క్షమాపణలు చెప్పిన రాహుల్‌ | Sakshi
Sakshi News home page

క్షమాపణలు చెప్పిన రాహుల్‌

Published Wed, Dec 6 2017 3:16 PM

I am a human, I do make mistakes: Rahul Gandhi  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ధరల పెరుగుదల విషయంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పొరపాటున ట్విట్టర్‌లో చేసిన ధరల గణాంకాల పట్టిక విషయంలో క్షమాపణలు చెప్పారు. తాను కూడా ప్రధాని మోదీ మాదిరిగానే మనిషినేనని పొరపాట్లు చేస్తుంటానని సమర్థించుకున్నారు. మనుషులన్న తర్వాత పొరపాట్లు చేయడం సహజం అన్నారు.

అదే సమయంలో బీజేపీ చేసిన ఆరోపణలు తనకు అనుకూలంగా మార్చుకొని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తన పొరపాట్లను గుర్తించి తెలియజేసినందుకు ధన్యవాదాలని చెప్పిన రాహుల్‌.. మున్ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని అన్నారు. నిత్యవసరాల ధరలు మోదీ హయాంలో 100శాతం పెరిగాయని చెప్పాల్సిన రాహుల్‌ పొరపాటున 177శాతం పెరిగాయని పోస్ట్‌ చేశారు. ధరలను మాత్రం సరిగ్గా పేర్గొన్న రాహుల్‌ శాతాల విషయంలో మాత్రం ఈ పొరపాటు చేశారు. దీనిపై బీజేపీ నేతలు రాహుల్‌ను తీవ్రంగా విమర్శించడంతో ఆయన ఈ మేరకు బదులిచ్చారు.

Advertisement
Advertisement